లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ హైకమాండ్. ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసిన కమలం పార్టీ రెండో జాబితాపై కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రాత్రి మరోసారి సమావేశమైంది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ. ప్రధాన మంత్రి బీజేపీ నేతృత్వంలో మొద లైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ తెలంగాణ, మహారాష్ట్ర, ఏపీ, హర్యానా సహా ఆయా రాష్ట్రాల్లోని స్థానా లు అభ్యర్థులపై చర్చించారు. సుదీర్ఘంగా సాగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో తెలంగాణలో మిగిలిన 8 స్థానాల్లో ఏడు స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేశారు. ఒక స్థానాన్ని పెండింగ్‌లో ఉంచారు. నేడో రేపో బీజేపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ కానుంది. తెలంగాణలో దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే చాన్స్ ఉంది.