స్వతంత్ర వెబ్ డెస్క్: నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయల్దేరారు. రోడ్డు మార్గాన కేసీఆర్ వెళ్తున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు నాగర్‌కర్నూల్‌లోని తేజ గార్డెన్స్‌కు చేరుకోని.. అక్కడే భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2:30కు తేజ గార్డెన్ నుంచి రోడ్డు మార్గాన మూడున్నరకు నార్లాపూర్ కంట్రోల్ రూమ్‌కు చేరుకుంటారు. అనంతరం కంట్రోల్ రూమ్‌లోకి ప్రవేశించి, మహాబాహుబలి మోటర్లను ఆన్ చేస్తారు. సాయంత్రం 4 గంటలకు నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు కోల్లాపూర్లోని పాలమూరు యూనివర్సిటీ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి ప్రగతి భవన్‌కు చేరుకుంటారు.
కొల్లాపూర్‌కు బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్..
0
310
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


