స్వతంత్ర వెబ్ డెస్క్: సింగరాయకొండ – కావలి రైల్వే రూట్‌లో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ఒకేరోజు రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దొంగలు(robbers ) దోపిడికి పాల్పడ్డారు. సికింద్రాబాద్ నుండి చెన్నై వెళ్లే హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో( Hyderabad Express) దొంగలు చోరీ చేశారు. ఎస్ 2, ఎస్ 4, ఎస్ 5, ఎస్ 6, ఎస్ 7, ఎస్ 8 బోగీల్లో దోపిడికి పాల్పడ్డారు. ఇదిలా ఉండగానే సికింద్రాబాద్ నుండి తాంబరం వెళ్లే చార్మినార్ ఎక్స్ ప్రెస్‌లో(Charminar Express) సైతం చోరీ జరిగింది. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ఎస్ 1, ఎస్ 2 బోగీల్లో దొంగలు బీభత్సం సృష్టించారు.
కాగా, అర్థరాత్రి 1.20 నుండి 1.50 నిమిషాల మధ్య ఈ దోపిడీ ఘటనలు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రయాణికులు తెట్టు, కావాలిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపై రాళ్ల దాడి చేసి దుండగులు పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు.


