Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. సభలో బాలయ్య విజిల్స్

స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ రెండవ రోజు కూడా వాడీవేడిగా మొదలైంది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టగా.. టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా.. స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలని.. సైకో పాలన నశించాలి అంటూ నినాదాలు చేశారు. స్పీకర్‌ పోడియం దగ్గరకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలపై మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అంబటి రాంబాబు మండిపడ్డారు.

సభలో నిరసన తెలిపేందుకు కొన్ని విధానాలు ఉంటాయని.. సీఎం జగన్‌, పాలన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోబోమన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ అంశంపై చర్చ జరుగుతుందని.. అందులో టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొనాలన్నారు. ఇది టీడీపీ ఆఫీస్ కాదని గుర్తు పెట్టుకోవాలన్నారు.. అయినా టీడీపీ సభ్యులు నిరసన కొనసాగించారు. ప్లకార్డులను వారి దగ్గర నుంచి తీసుకోవాలని స్పీకర్‌ను మంత్రి జోగి రమేష్ కోరారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.

ఏపీ శాసనసభ సమావేశాల్లో రెండో రోజు కూడా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హల్చల్ చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్థానంలో కూర్చున్న బాలకృష్ణ ఆ తర్వాత అక్కడే కుర్చీలో నిలబడి నిరసన తెలిపారు. సభలో బాలకృష్ణ విజిల్స్‌ వేయడంతో బాలకృ‌ష్ణకు కనీస అవగాహన లేకుండా సభలో ప్రవర్తిస్తున్నాడని మంత్రి కాకాణి విమర్శించారు. చంద్రబాబును కోర్టు విడుదల చేయాలా, అసెంబ్లీ విడుదల చేయాలా అనేది కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు.

మరోవైపు మార్షల్స్ చుట్టుముట్టిన సమయంలో మరింతగా  బాలకృష్ణ విజిల్స్ ఊదుతూ కనిపించారు. ఈ క్రమంలో “బాలకృష్ణకు మెంటల్.. సభకు రానివ్వొద్దని వైీసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు”. కాలేజీలో అమ్మాయిలను చూసి విజిల్స్ వేస్తున్నట్లు టీడీపీ నేతల ప్రవర్తన ఉందని మండిపడ్డారు. ‘

చంద్రబాబు సీట్లో ఇవాళ బాలకృష్ణ కూర్చున్నారని, ఆయన అక్కడ కూర్చోవడం చూసి పైనుంచి ఎన్టీఆర్ చూసి సంతోషపడి ఉంటారన్నారు. మెంటల్ ప్రాబ్లమ్ ఉన్న బాలకృష్ణను సభలోకి రానివ్వొద్దని సూచించారు. సభ్యుల్ని తుపాకీతో కాల్చినా కేసులుండవని, టీడీపీ వాళ్లందర్నీ సస్పెండ్ చేసి మెంటల్ ఆస్పత్రికి తరలించాలన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్‌ మీద స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి కన్నబాబు దేశం మొత్తం మీద మెంటల్ సర్టిఫికెట్‌ తెచ్చుకున్న ఏకైక ప్రజాప్రతినిధి బాలకృష్ణ మాత్రమేనన్నారు. సర్టిఫైడో సైకో బాలకృష్ణ మాత్రమే అని, తొడగొట్టడం, మీసం మెలేయడం ఆయన వృత్తి ధర్మం అని చెప్పడం ఆయన మానసిక స్థితికి అద్ధం పడుతోందన్నారు. చంద్రబాబు కుర్చీలో కూర్చుని హంగామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఏపీ అసెంబ్లీ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైనా టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించగా.. వారి తీరుపై మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సైకో పాలన ఎప్పుడో పోయిందని.. అవినీతి కేసులో అరెస్టై సైకో జైలులో ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోర్టుల్లో స్టేలతో చంద్రబాబు బతుకుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో వీడియోలు తీశారంటూ.. స్పీకర్ సభ నుంచి ఇద్దరు టీడీపీ సభ్యుల సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడు, బి. అశోక్‌లను ఈ సెషన్‌ మొత్తం సభ నుంచి అచ్చెన్నాయుడు, అశోక్‌లను సస్పెండ్ చేశారు. అలాగే టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు.

దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. పిరికిపందల్లా పారిపోవద్దని.. దేవాలయం లాంటి అసెంబ్లీని అవమానించడం సరికాదన్నారు. బజారు కూతలు కూస్తే ఊరుకునేది లేదన్నారు. చంద్రబాబు ప్రజల సొమ్మును దోచేశారని.. టీడీపీ రౌడీయిజానికి ఎవరూ భయపడరన్నారు. చిల్లర కోసమే విజిల్స్‌ వేస్తున్నారన్నారు. సభలో ఇలాంటి పద్దతి సరికాదన్నారు. అయినా టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన కొనసాగించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.

సభలో బాలయ్య తీరుపై మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీటుపైకి ఎక్కి విజిల్ ఊదారని.. సీటు ఎక్కి ఎందుకు ఆ సీట్లో కూర్చోమంటూ బాలయ్యకు చురకలు అంటించారు. తండ్రిని చంపిన చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం చూస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత బాలయ్య ఇంటికి వెళ్లి విజిల్ ఊదుకోవాల్సిందే అన్నారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్