ఏపీ సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్బంగా ఆయన రోడ్లను శుభ్రం చేశారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వయంగా చీపురుపట్టి ఊడ్చారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. నేషనల్ కాలేజీ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి చంద్రబాబు నివాళి అర్పించారు. స్వాతంత్య్రం కోసం బాపూజీ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు.