తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యల్లో విఫలమైన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. పండుగ వేళ ఇలాంటి విషాదకర ఘటనలపై చింతిస్తున్నామన్నారు. బాధితులకు సత్వర సహాయక చర్యలను స్వయంగా అందించేందుకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం టీటీడీ పోలీసు అధికారులతో నిరంతరం మంత్రి ఆనం సమీక్షిస్తున్నారు.
ఇవాళ సీఎం చంద్రబాబు తిరుపతికి వెళ్లనున్నారు. మ.12 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. తొక్కిసలాటలో గాయపడ్డ క్షతగాత్రులను పరామర్శించనున్నారు.
మరోవైపు సీఎం చంద్రబాబు ఆదేశాలతో తిరుపతికి ముగ్గురు మంత్రులు బయల్దేరారు. మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్ తిరుపతికి వెళ్లనున్నారు. క్షతగాత్రులకు సహాయక చర్యలు, వైద్యసేవలను పర్యవేక్షించనున్నారు మంత్రులు.