ఉత్తరాంధ్రలో భారీ వర్షాల దృష్ట్యా ఆ ప్రాంత మంత్రులకు సీఎం చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో తిరిగి సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్‌లో నిన్న అర్ధరాత్రి వరకూ సీఎం సమీక్ష నిర్వహించారు. విజయవాడ నగరంలో వరద సహాయక చర్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరదలపై యుద్ధం తుది దశకు వచ్చిందని.. ఇవాళ సాయంత్రంలోపు నగరంలో సాధారణ స్థితి నెలకొనాలని ఆదేశించారు. అనంతరం ఇతన పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.