రాజకీయాలతో ఎప్పుడూ బిజీగా ఉండే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరో మైలురాయి అందుకున్నారు. ట్విట్టర్ లో ఏకంగా 5మిలియన్ల(50లక్షలు)ఫాలోవర్లను సంపాదించుకున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. పుట్టినరోజు(ఏప్రిల్20)కు ఒకరోజు ముందు ఈ ఫీట్ అందుకున్నారని సంబరపడుతున్నారు.
ఏపీ రాజకీయ ముఖ్య నాయకుల ట్విట్టర్ ఫాలోవర్లను ఓసారి గమనిస్తే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ 5.3మిలియన్ల ఫాలోవర్లతో తొలి స్థానంలో ఉండగా.. తాజాగా 5మిలియన్లతో చంద్రబాబు రెండోస్థానం చేరుకున్నారు. ఇక సీఎం జగన్ 2.5మిలియన్ల ఫాలోవర్లతో మూడవ స్థానంలో నిలిచారు. నారా లోకేష్ 1మిలియన్‌కు దగ్గరలో ఉండి నాల్గవ స్థానంలో ఉన్నారు.
అయితే ఫేస్ బుక్ ఫాలోవర్లలో మాత్రం సీఎం జగన్ ముందు వరుసలో ఉన్నారు. 2.1మిలియన్ ఫాలోవర్లతో మొదటి స్థానంలో ఉండగా.. 2మిలియన్ ఫాలోవర్లతో లోకేష్ రెండో స్థానంలో నిలిచారు. 1.8 మిలియన్ ఫాలోవర్లతో చంద్రబాబు.. 1మిలియన్‌కు దగ్గరలో పవన్ కల్యాణ్ మూడు, నాలుగు స్థానాలు దక్కించుకున్నారు.