LPG Cylinder |గ్యాస్ ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇటీవల కాలంలో గ్యాస్ సిలిండర్ ధర 11వందల రూపాయలకు చేరుకోవడంతో ఎంతో మంది సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో గ్యాస్ వినియోగదారులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ప్రతి సంవత్సరం 12 గ్యాస్ సిలిండర్లపై అందుతున్న సబ్సిడీని ఉజ్వల యోజన లబ్ధిదారులకు మరో ఏడాది పాటు పొడిగిస్తే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
LPG Cylinder |దేశంలోని 9.5 కోట్ల మందికిపైగా వినియోగదారులు ప్రతి నెలా గ్యాస్ సిలిండర్‌పై రూ.200 ప్రయోజనం పొందనున్నారు. దీంతో ప్రభుత్వంపై రూ.7,680 కోట్లరూపాయల ఆర్థిక భారం పడనుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన వినియోగదారు సగటు LPG వినియోగం 2019-20లో 3.01 రీఫిల్స్ నుంచి 2021-22లో 3.68కి అంటే 20 శాతం పెరిగిందని కేంద్రం వెల్లడించింది. పేద కుటుంబాల నుంచి వయోజన మహిళలకు ఉచిత LPG కనెక్షన్లను అందించడానికి ప్రభుత్వం 2016వ సంవత్సరంలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించింది.
బ్యాంకు ఖాతాకు నేరుగా రాయితీ: ప్రధానమంత్రి ఉజ్వల యోజన వినియోగదారులకు ఇచ్చే రాయితీని నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)లు ఇప్పటికే 2022 మే నుంచి ఈ సబ్సిడీని అందిస్తున్నాయి.