30.7 C
Hyderabad
Friday, June 9, 2023

రెండు కీలక తీర్మానాలకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

Cm Jagan fires on Chandrababu: ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో రెండు కీలక తీర్మానాలకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చుతూ ఒక తీర్మానం… దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని మరో తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో కులాల ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఏకసభ్య కమిషన్‌ వేయగా.. ఈ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నివేదిక ఆధారంగా ఈ తీర్మానం చేశామని.. వీటిని ఆమోదించి కేంద్రానికి పంపుతున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు సీఎం జగన్. ప్రజాధనాన్ని తనకు కావాల్సినవారికి చంద్రబాబు కట్టబెట్టారని మండిపడ్డారు. అమరావతిలో జరిగిన నిర్మాణాల్లో భారీగా అవినీతి జరిగిందన్నారు. ‘చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌, మనోజ్‌ డీల్‌ చేశారు. ఆర్వీఆర్‌ రఘు, కృష్ణ, నారాయణ సంస్థలకు నిధులు మళ్లించారు. చివరిగా ఈ నిధులన్నీ చంద్రబాబుకు చేరాయి’ అంటూ కుండ బద్దలు కొట్టినట్లు వ్యాఖ్యానించారు.

Latest Articles

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.. గవర్నర్ కు టీడీపీ విన్నపం

స్వతంత్ర, వెబ్ డెస్క్: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ నేతలు అన్నారు. గురువారం నాడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, మండలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
252FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్