నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రంరెడ్డి గడపగడప కార్యక్రమంతో పాటు ఎన్నికల ప్రచారం పేరుతో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ ప్రజల్లో లేకపోవడంతో టీడీపీకి ఓటింగ్ శాతం తగ్గుతుందని సీనియర్ నాయకులు చెబు తున్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య గట్టి పోటీ ఉంటుందని ప్రజలు అభిప్రాయపడు తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు.