39.2 C
Hyderabad
Monday, April 15, 2024
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

మత్స్యకారుల ఆవేదన

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పొన్నపల్లిలో వశిష్ట గోదావరి మీద ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారు లకు జీవనోపాధి లేక రోడ్డున పడ్డారు. ప్రస్తుతం గోదావరిలో మత్స్య సంపద లేకపోవడంతో జీవనోపాధి కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో మత్స్యకారులు ఉన్నారు. నర్సాపురం పాలకొల్లు రోడ్డులో ఉన్న ఆక్వా ఫ్యాక్టరీ రసాయన వ్యర్థాలను పైపుల ద్వారా గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో గోదావరి నీరు కలుషితమై మత్య్స సంపద నశించింది.

5కే రన్‌

ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఖమ్మం జిల్లాలో సర్దార్‌ పటేల్‌ స్టేడియం నుండి ట్యాంకు బండ్‌ వరకు జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో 5కేరన్‌ నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓటు హక్కు నమోదుకు ఏప్రిల్‌ 14 వరకు అవకాశం ఉందని… 18సంవత్సరాలు నిండినవారు నమోదు చేసుకోవాలని సూచించారు.

కార్యకర్తల సమావేశం

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్టా రాగమయి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలంతా ఏకమై అభ్యర్థిని 50వేల మెజార్టీతో గెలిపించా లని కోరారు. కార్యక్రమంలో మట్టా దయానంద్‌, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అమ్మవారి సేవలో..

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని అహోబిలం మఠాధిపతి రంగనాథ యతీంద్ర మహదేశికన్‌ దర్శిం చుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. దర్శనం తర్వాత వేద పండితులు శేష వస్త్రాన్ని సమర్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లాడ గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. స్థానికులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.

వేసవి సెలవులు

ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది. ఈ నెల 24 నుంచి జూన్‌ 11వరకు సెలవులను ఇచ్చింది. జూన్‌ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

శ్రీవారి సేవలో..

తిరుమల శ్రీవారిని బీఆర్‌ఎస్‌ ఎంపీ లింగయ్య యాదవ్‌ దర్శించుకున్నారు. దర్శనం తర్వాత వేద పండితులు వేద ఆశీర్వాదం అందజేయగా… ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకున్నానన్నారు.

దర్శనం

తిరుమల శ్రీవారిని మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే రోహిత్‌, ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి, సునీతా మహేందర్‌ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనం తర్వాత వేద పండితులు వేద ఆశీర్వాదం అందజేయగా… ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకెళ్లాలని స్వామివారిని ప్రార్థించానని మైనంపల్లి అన్నారు.

షార్ట్‌ సర్క్యూట్‌

ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం బిల్ట్ కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే పేపర్‌కు విలువ పడిపోవడంతో 2014 సంవత్సరంలో యాజమాన్యం ఫ్యాక్టరీని మూసేశారు. ఫ్యాక్టరీని తొలగింపు పనులు చేస్తుండగా విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యి మంటలు చెలరేగాయి. ఘటనా స్థనాలకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు.

 

Latest Articles

ముగిసిన సీబీఐ కస్టడీ ….కవితను కలిసిన కేటీఆర్

ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. ఉదయం 10 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను సీబీఐ హాజరు పర్చనుంది. సీబీఐ అధికారుల బృందంలో మహిళా అధికారులు కవితను మూడు రోజుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్