సినీ నటి జత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు IPS అధికారులపై TDP నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ముగ్గురు ఐపియస్ అధికారులు ముంబై నటిని చిత్ర హింసలు పెట్టారని అన్నారు. YCP హయాంలో CMO కేంద్రంగా కుట్ర జరిగిందని ఆరోపించారు. జగన్ ఆదేశాలను PSR ఆంజనేయులు అమలు చేశారని అన్నారు. రాణా, విశాల్ గున్నీ దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. గతంలో కూడా PSR ఆంజనేయులు అనేక మందిని ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. గున్నీ రిపోర్ట్ ఆధారంగా ఆంజనేయులును అరెస్టు చేసి పోలిస్ కస్టడీలోకి తీసుకోవాలని బుద్ధ వెంకన్న డిమాండ్ చేశారు.