హీరో నాని సినిమా షూటింగ్ లో విషాదం చోటుచేసుకుంది. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ లో విషాద ఘటన జరిగింది.
జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో హిట్ 3 సినిమా షూటింగ్ జరుగుతోంది. నాని సినిమాకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా కే ఆర్ క్రిష్ణ చేస్తున్నారు. అయితే షూటింగ్ సమయంలో ఆమె గుండెపోటుతో మృతి చెందారు. ఆమె వయసు 30 ఏళ్లు. కే ఆర్ కృష్ణ మహిళా అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. దీంతో షూటింగ్ స్పాట్‌లో విషాదం నెలకొంది.