తిరుమలలో శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఉదయం 10 గంటల సమయంలో ఆలయపై నుంచి ఓ విమానం వెళ్లడం కలకలం రేపింది. ఆలయంపై విమానాలు ప్రయాణం చేయడం ఆగమ శాస్త్ర సాంప్రదాయ విరుద్ధం. నో ఫ్లైయింగ్ జోన్‌గా తిరుమలను ప్రకటించాలని ఇప్పటికే అనేకసార్లు కేంద్ర విమానయానశాఖను టీటీడీ కోరింది.