ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మహేష్ బాబు,. రాజమౌళి ఫ్యాన్స్‌కు సంక్రాంతి పండుగ ముందే వచ్చేసింది. కాసేపట్లో హైదరాబాద్‌లో మహేశ్, రాజమౌళి సినిమా పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు-ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా షూటింగ్ ఆరు దేశాల్లో జరుపుకోబోతుంది. ఈ సినిమా ఈ వేసవిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారట. మొదటి భాగం 2027లో విడుదల కానుంది. జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కిస్తున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. ఈ సినిమాకి యంయం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
బడ్జెట్ విషయానికి వస్తే.. 1000 కోట్లు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని తెలిసింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ ఇంత బడ్జెట్ తో నిర్మించలేదు. ఇదే కనుక నిజమైతే.. బడ్జెట్ పరంగా కూడా సరికొత్త రికార్డ్ సెట్ చేసినట్టే. మరి.. ఈ క్రేజీ మూవీతో మహేష్, రాజమౌళి కలిసి చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి.