స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం భీమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. లంక నుంచి కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా గోదావరి నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు గల్లంతు అవ్వగా.. మరో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. అధిక లోడు కారణంగానే ఈ పడవ మునిగినట్లు గుర్తించారు.