హైదరాబాద్‌లో బీజేపీ మహిళా మోర్చా ఆందోళన చేపట్టింది. కోఠి మెడికల్ అండ్ హెల్త్ కార్యాలయం ముట్టడికి బిజెపి మహిళా మోర్చా యత్నించింది. ఆశా వర్కర్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ మహిళా మోర్చా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించకుండా, వారి నిరసనలు పట్టించు కోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందంటూ మండిపడ్డారు. ఆశా వర్కర్లకు సకాలం లో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టంచేశారు. ఆందోళనకు దిగిన మహిళా మోర్చా నేతలను పోలీసులు అడ్డుకోవడంతో గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు.