23.7 C
Hyderabad
Tuesday, October 14, 2025
spot_img

వాలంటీర్ల దారుణాలు.. సిగరెట్లు తీసుకురాలేదని బాలుడ్ని డాబాపై నుంచి తోశాడు..

స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్రంలో వాలంటీర్ల దారుణాలు పెరుగుతున్నాయే గాని తగ్గడం లేదు.. వాలంటీర్​ వ్యవస్థతో దేశం అంతా ఏపీ వైపు చూస్తుందని సీఎం జగన్​ గొప్పలు చెప్పుకుంటున్నారు. కాని వారి అరాచకాలు మాత్రం రోజు రోజుకి హద్దుమీరు తున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కణుపూరు గ్రామంలో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. కణువూరు గ్రామంలోని కల్యాణం సతీష్‌ వాలంటీరుగా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి తల్లోజు శశిధర్‌ని ఈ నెల 11న రోడ్డుపై వెళ్తుండగా ఆపి.. సిగరెట్లు తెచ్చి పెట్టమని కోరాడు. బాలుడు వినకుండా వెళ్లిపోయాడు.

దీన్ని మనసులో పెట్టుకున్న వాలంటీర్‌ సతీష్.. అదే రోజు రాత్రి బుర్రకథ కార్యక్రమం దగ్గర ఉన్న శశిధర్‌ను, అక్కడే ఉన్న మరో విద్యార్థిని సరదాగా తిరిగి వద్దామంటూ చెప్పి ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని సామిల్లు దగ్గర ఉన్న డాబాపైకి తీసుకువెళ్లాడు. అక్కడ అప్పటికే మద్యం సీసాలు, బజ్జీలు ఉన్నాయి. బజ్జీలు తినిమని వాళ్లుకు ఇచ్చాడు. ఆపై ‘సిగరెట్టు తెమ్మంటే ఎందుకు తీసుకురాలేదు? నేనవరో తెలుసా’ అంటూ శశిధర్​ను చావబాదాడు. కొట్టద్దంటూ మరో బాలుడు ప్రాధేయపడగా.. ఇద్దర్ని కలిపి కొట్టాడు. ఇద్దరు తప్పించుకుంటూ కిందకి వెళ్లిపోతుండగా.. శశిధర్‌ను వెనుక నుంచి గట్టిగా తన్నడంతో డాబా పైనుంచి రోడ్డుపై పడ్డాడు. ఇక్కడ జరిగిన విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ వారిద్దరినీ బెదిరించాడు.

తరువాత శశిధర్‌ని తానే బైక్​పై ఎక్కించుకుని ఇంటి వద్ద దింపాడు. గుడిమెట్లు ఎక్కుతుండగా కింద పడితే తీసుకువచ్చానని అతడి తల్లిని నమ్మించాడు. తీవ్రగాయాలైన బాలుడ్ని తల్లిదండ్రులు రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అప్పటికీ గాయాలు నయం కాకపోవడంతో తరువాత ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ శస్త్రచికిత్స నిర్వహించారు. బాలుడు శశిధర్‌ గుడి మెట్ల మీద పడలేదని ఆ నోటా ఈ నోటా విన్న అతని తండ్రి వీరబాబు.. అనుమానంతో ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ తన కుమారుడి చెప్పు కనిపించడంతో శశిధర్‌ని ఆరాతీశాడు. ఘటన జరిగిన సమయంలో ఉన్న మరో బాలుడ్ని, శశిధర్‌ను గట్టిగా నిలదీయడంతో వాలంటీర్‌ సతీష్‌ చేసిన నిర్వాకం బయటపడింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్