రాజ్యసభలో ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్, ఎంపీ జయా బచ్చన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కించపరిచారంటూ జయాబచ్చన్‌పై.. ఛైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. అయితే జయాబచ్చన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా.. అదే స్థాయిలో మండి పడ్డారు. అంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఫలితంగా ఇద్దరి మధ్య ఒక్కసారిగా మాటలయుద్ధం మొదలైంది. తాను ఒక నటినని.. ఎవరి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోగలనన్నారు. ఇలా గట్టిగా మాట్లాడడం సరికాదని.. మీరు ఛైర్మన్ హోదాలో ఉన్నప్పటికీ మనమంతా ఒక్కటేనని జయాబచ్చన్ అన్నారు. ఆమె వ్యాఖ్యలపై జగ్‌దీప్ ధన్‌కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దయచేసి కూర్చోండని మందలించారు. మీరు సెలెబ్రిటీ అయితే అయుండొచ్చని కానీ సభా మర్యాదలు పాటించాలని తేల్చి చెప్పారు.