AR Rahman’s Son AR Ameen |ప్రమాదం ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో ఎవరూ ఊహించలేం. క్షణాల్లో జీవితాలు తలకిందులవుతాయి. అదష్టం బాగుంటే ప్రాణాలతో బయటపడతాం. లేదంటే ఇక అంతే సంగతులు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్(AR Rahman) కుమారుడు ఏఆర్ అమీన్(AR Ameen)కి ఇటువంటి సంఘటనే ఎదురైంది. అమీన్ తన బృందంతో కలిసి వేదిక మీద పర్‌ఫామ్ చేస్తుండగా పైన వేళ్లాడుతున్న భారీ షాండలియా సడెన్ గా కిందపడింది. దీంతో టీం అంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అయితే అదష్టవశాత్తూ ఎవ్వరికీ ఎలాంటి ప్రాణహానీ జరగలేదు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు అవుతుండగా.. తాజాగా అమీన్ సోషల్ మీడియా వేదికగా ఆ చేదు అనుభవం గురించి పోస్ట్ చేశాడు. తన తల్లిదండ్రులు, దేవుడు, అభిమానులు, శ్రేయోభిలాషుల ఆశీర్వాదం వల్లే తాను ఇవాళ బతికి ఉన్నానని లేదంటే ఘోరం జరిగిపోయి ఉండేదని వెల్లడించాడు.