స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఈనెల 15న లోకేశ్ పాదయాత్ర 100 రోజుల మైలురాయిని చేరుకోనుంది. దీంతో ఆయన పాదయాత్రకు సంఘీభావంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు పాదయాత్రలు చేపట్టాలని అధిష్టానం నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గంలో 3వేల మంది పార్టీ శ్రేణులతో 7 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని సూచించింది. నాయకులు, కార్యకర్తలు, ఈ సంఘీభావ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరింది. కాగా ఈ ఏడాది జనవరి 27న లోకేశ్.. యువగళం పేరుతో 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.