31.5 C
Hyderabad
Sunday, March 1, 2026
spot_img

RRR కస్టోడియల్ టార్చర్ పై సీబీఐకి హైకోర్టు కీలక ఆదేశాలు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సీఐడీ అధికారులు తనను చిత్రహింసలకు గురిచేశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రఘురామను సీఐడీ అదుపులోకి తీసుకున్న సమయంలో తక్షణమే కాల్ డేటా సేకరించాలని CBI అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. టెలికాం నిబంధనల ప్రకారం రెండేళ్ల వరకు కాల్ డేటా ఉంటుందని.. ఈ కేసులో కాల్ డేటా ఎంతో కీలకమని  రఘురామ తరఫు న్యాయవాది నౌమీన్ వాదించారు.

ఇక సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ హరినాథ్ వాదిస్తూ ఈ కేసు FIR సీఐడీ వద్దనే ఉంది కాబట్టి కాల్ డేటా కూడా సీఐడీ అధికారులే సేకరించాలని తెలిపారు. సీబీఐ న్యాయవాది వాదనలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో పిటిషనర్ ఆరోపణలు చేసింది సీఐడీ అధికారుల మీద అయితే కాల్ డేటా సేకరించాలని వారిని ఎలా ఆదేశిస్తామని ప్రశ్నించింది. మరోవైపు కాల్ డేటా సేకరించాలని చెప్పడం చట్టవిరుద్ధమని సీఐడీ ఇంప్లీడ్ పిటిషన్ వేసింది. తదుపరి విచారణను వేసవి సెలవులు అనంతరం చేపడతామని న్యాయస్థానం పేర్కొంది.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్