వైసీపీ నేతల పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్‌కు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుత సీఎం, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ ముందస్తు బెయిల్‌కు హైకోర్టు నో చెప్పింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేవరకు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని వైసీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని టీడీపీ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. దీనిపై మధ్యాహ్నం తర్వాత హైకోర్టు నిర్ణయం వెలువరించనుంది.
వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలో ఫర్నిచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేశ్, వైకాపా నేత దేవినేని అవినాష్ తదితరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని వారు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం విచారణ చేపట్టింది.


