హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. హైడ్రాలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నట్లు బెదిరిస్తున్నారని చెప్పారు. తమ విభాగాన్ని నీరు గార్చే ప్రయత్నాలు, తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైడ్రా పేరుతో డబ్బు కావాలని ఒత్తిడి చేస్తే స్థానిక పోలీస్‌స్టేషన్, ఏసీబీకి ఫిర్యాదు చేయాలని రంగనాథ్ సూచించారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో డబ్బు వసూళ్లకు పాల్పడిన విప్లవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు చెప్పారు.