AP Employees | ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆందోళనబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘం నేతలతో కలిసి సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తూ ఉద్యమ నోటీసులు అందజేశారు. ఇకపై చాయ్, బిస్కెట్ సమావేశాలతో మోసపోయే ప్రసక్తే లేదని.. ఉద్యోగులను ప్రభుత్వం చులకనగా చూస్తోందని ఏపీ జేఏసీ(AP JAC) అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. మార్చి 9 నుంచి ఉద్యమం ప్రారంభిస్తామని.. దశల వారిగా తమ నిరసనలు తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఫోన్ డౌన్, పెన్ డౌన్, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు లాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. అప్పటికీ కూడా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు వెల్లడించారు.
Read Also: ముంబైలో క్రికెట్ దేవుడి విగ్రహం ఏర్పాటు