సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పేద ప్రజల కోసం నూతన సంవత్సరం వేల మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి హౌసింగ్, ఇందిరమ్మ ఇళ్లపై ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్ సర్కార్. ఒక్కో ఇంటికి 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్న ఈ పథకం, లబ్ధిదారుల కోసం మరింత ప్రత్యేక సౌకర్యాలు అందించేందుకు కూడా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.