తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. స్థానిక కపిల తీర్థం సమీపంలోని రాజ్‌పార్క్ హోటల్‌లో బాంబులు పెట్టామంటూ హోటల్‌కు మెయిల్ పంపించారు ఆగంతకులు. దీంతో వెంటనే అప్రత్తమైన హోటల్ యాజమాన్యం అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో హోటల్ కు చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఎలాంటి బాంబులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.