ది క్రీక్ ప్లానెట్ స్కూల్ వార్షిక క్రీడోత్సవానికి గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి స్టేడియం వేదిక అయింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా వింగ్ కమాండర్ శ్రీకాంత్, ఇండియన్ అథ్లెట్ నందిని అగసారా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ది క్రీక్ ప్లానెట్ స్కూల్ చైర్మన్ నీ బొల్లినేని శ్రీనయ్య, వైస్ చైర్మన్ పాండురంగా చారి, ఫౌండర్ అండ్ డైరెక్టర్ నరేంద్ర ప్రసాద్, అకడమిక్ హెడ్ Dr. జయశ్రీ నాయర్, COO Dr. జీవని గద్దె, అకాడమిక్ ఆఫీసర్ అనుపమ దేవి వివిధ శాఖల ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపాల్ హాజరయ్యారు. విశిష్ట అతిధి క్రీడాజ్యోతిని వెలిగించి విద్యార్ధి క్రీడా నాయకులకు అందజేశారు.
మస్కట్ రిలీజ్ చేసి బెలూన్లు గాలిలోకి వదలడంతో కార్యక్రమం ప్రారంభమైంది. సీనర్జిటిక్ ఎక్భా విగాంజ దీ బ్లెస్సింగ్ గ్లోరీ ఆఫ్ ది క్రీక్ థీమ్ తో సాగిన కార్యక్రమం ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకుంది. విద్యార్ధులు ప్రదర్శించిన డ్రిల్స్, మార్షల్ ఆర్టీ, యోగ, కరాటే, కోలాటం ఆహుతులను ఆకర్షించాయి. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరికీ విశిష్ట అతిధి చేతులమీదుగా సర్టిఫికెట్స్, మెడల్స్ అందజేశారు. గత సంవత్సరం ఆల్ ఇండియా సీనియర్ సెకండరీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్ధులను, ఉపాధ్యాయులను ఈ సందర్భంగా యాజమాన్యం వారు సత్కరించారు ముఖ్య అతిథి మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యం తో పాటు క్రీడాస్ఫూర్తిని పట్టుదలను పెంచుతాయని నేటి రోజుల్లో చదువు వల్ల ఎదుర్కొంటున్న ఒత్తిడిని తగ్గిస్తాయని అన్నారు.
క్రీడలను కూడా చదువులో భాగం చేయాలని అప్పుడే దృఢభారత నిర్మాణం జరుగుతుందని తెలిపారు. క్రీడలను ప్రోత్సహిస్తూ ఇంత అద్భుత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు . తల్లిదండ్రులు మాట్లాడుతూ వారికి నిర్వహించిన ఆటల పోటీలు వారి బాల్యాన్ని గుర్తు చేశాయని హర్షాన్ని వ్యక్తం చేశారు. వారి చిన్నారులొ దాగివున్న ప్రతిభను వెలికితీస్తున్న యాజమాన్యానికి, వారి సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తల్లిదండ్రులకు పాఠశాల సిబ్బందికి యాజమాన్యం వారు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయగీతంతో కార్యక్రమం ముగిసింది.