టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణకు మరోసారి డుమ్మా కొట్టారు. ఇవాళ విచారణకు హాజరుకాలేనని తన అడ్వకేట్ ద్వారా ఒంగోలు పోలీసులకు RGV సమాచారం ఇచ్చారు. విచారణకు హాజరుకాలేక పోవడానికి గల కారణాలను పోలీసులకు తెలుపుతానని ఆయన చెప్పారు. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా చంద్రబాబు, పవన్‌ను కించపిరిచేలా RGV పోస్టులు పెట్టారని మద్దిపాడు పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది. అయితే ఈనెల 19నే విచారణకు హాజరుకావాలని పోలీసులు వర్మకు నోటీసులు ఇవ్వగా..తనకు వారం రోజులు గడువు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ గడువు తీరిపోవడంతో ఇవాళ RGVని పోలీసులు విచారించనున్నారు.
అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని వర్మ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం RGV పిటిషన్‌ను తిరస్కరించింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. దీంతో రాంగోపాల్ వర్మ విచారణకు హాజరు కావడం తప్పనిసరైంది.