ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం(Srisailam)లో రెండోరోజు ఉగాది మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మహాదుర్గ అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. కైలాసవాహనంపై ఆశీనులై శ్రీస్వామి అమ్మవారు ప్రత్యేక పూజలందుకున్నారు. అనంతరం సాయంకాలం ఆది దంపతుల గ్రామోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. స్వామి వారి ఉత్సవ మూర్తులను చూసి భక్తులందరూ తన్మయత్వంలో మునిగిపోతున్నారు. శ్రీశైల మల్లన్న మమ్మేలుము సామి అంటూ.. వేడుకుంటున్నారు. ఈ మహోత్సవాలని తిలకించడానికి వేలాదిగా భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు.