Nandyala జిల్లాలోని డోన్(DHONE) పట్నంలో దారుణం జరిగింది. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు ఇవ్వాలని వీరంగం సృష్టించారు. ఈ క్రమంలోనే వ్యక్తులపై కత్తులతో దాడికి దిగారు. తమ దగ్గర కేవలం 350 రూపాయలు మాత్రమే ఉన్నాయి అని చెప్పడంతో కత్తులతో తీవ్రంగా దాడి చేసి పరారయ్యారు. అర్ధరాత్రి సమయం కావడంతో బస్టాండ్ లో ఎవరు లేకపోవడంతో తీవ్ర రక్తస్రావంతో ఉదయం వరకు అక్కడే పడిపోయారు. తెల్లవారుజామున స్థానికులు గమనించి పోలీసులుకు సమాచారం అందించడంతో డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో ఒకరు హోటల్లో పని చేస్తుండగా, మరొకరు చెత్త పేపర్లు ఏరుకుంటూ జీవిస్తున్నారు అని పోలీసులు తెలిపారు.
Read Also: గ్యాస్ ధరలు మళ్ళీ పెరిగాయి.. భార్యతో సామాన్యుడి గొగ్గోలు ఎలా ఉందో చూడండి