అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్‌ల వివాహం అత్యంత వైభవంగా.. యావత్ ప్రపంచమే చర్చించుకునేలా సాగింది. వివాహ మహోత్సవమే కాదు.. అతిథులకిచ్చిన కోట్ల రూపాయల పెళ్లి కానుక కూడా అంతే చర్చనీయాంశమైంది. వివాహానికి దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు హాజరుకాగా.. బాలీవుడ్ హీరోలు షారుక్‌ఖాన్, రణ్‌వీర్‌సింగ్, శిఖర్ పహారియా, వీర్‌పహారియా సహా పదిమందికి అత్యంత ఖరీదైన బహుమతులు అందజేసి ఆశ్చర్యపరిచారు. ఔడెమాజ్ పిగే అనే స్విస్ కంపెనీ తయారుచేసిన రాయల్ ఓక్ పర్‌పెచ్యువల్ క్యాలెండర్ వాచీలను గిఫ్ట్‌గా ఇచ్చారు.
ఔడెమాజ్ పిగే అనే స్విస్ కంపెనీ తయారుచేసిన రాయల్ ఓక్ పర్‌పెచ్యువల్ క్యాలెండర్ ఒక్క వాచీ ధర 2 కోట్ల పైమాటేనని తెలుస్తోంది. వీటిని ధరించిన షారుక్ ఖాన్, రణ్‍వీర్ సింగ్ పోజులిచ్చిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వాచీలకు 18 క్యారెట్ల పింక్ గోల్డ్ కేస్‌లు, బ్రేస్‌లెట్లు ఉన్నాయి. టైముతో పాటు వారం, తేదీ, నెల, లీప్ సంవత్సరం ఇలా చాలా వివరాలే ఈ వాచీలు చెప్పగలవు. 20 మీటర్లలోతు అంటే దాదాపు 65 అడుగుల లోతు నీటిలో పడ్డా ఈ వాచీలు బాగానే పనిచేస్తాయి.


