రైతు భరోసా పథకం విధివిధానాల పై హనుమకొండ కలెక్టరేట్లో రైతు భరోసా పథకంపై సదస్సు ఏర్పాటు చేశారు. రైతు భరోసా పథకంపై వివిధ వర్గాల నుంచి వస్తున్న అభిప్రాయాలను సేకరించి రైతు బంధు ఎవరికి ఇవ్వాలనే ఆలోచనతో ముగ్గురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు.
ఈ మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్, రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, సభ్యులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతిరాజ్‌శాఖ మంత్రి సీతక్క సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సులో రైతుభరోసా విధి విధానాలపై రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, ఇతరవర్గాల నుంచి మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి సమర్పిస్తుంది. కాగా రైతు భరోసా సదస్సుకు ఉమ్మడి వరంగల్ నుంచి 250మంది రైతులను ఆహ్వానించారు.