రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చంట్ వివాహం ప్రస్తుతం టాక్‌ఆఫ్‌ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. వీరి వివాహం జులై 12న జరగనుంది. దీంతో ఇప్పటికే ఆ ఇంట పెళ్లి హడావుడి మొదలైపోయింది. ఐదు నెలలుగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పెళ్లికి పది రోజులే సమయం ఉండటంతో అంబానీ కుటుంబం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిరుపేద ప్రజల కోసం సామూహిక వివాహాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనంత్ – రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా జులై 2వ తేదీన సాయంత్రం 4:30 గంటలకు ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ లో గల స్వామి వివేకా నంద విద్యా మందిర్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ వేడుకలకు సంబంధిం చిన ఓ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.