25.2 C
Hyderabad
Wednesday, February 4, 2026
spot_img

ఏపీపై బీజేపీ ప్రత్యేక దృష్టి.. నేడు విశాఖలో అమిత్ షా పర్యటన

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీలో రాజకీయ వాతారణం వేడెక్కింది. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో పార్టీలు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. పొత్తులపై జోరుగా ప్రచారం జరుగుతోంది. అధికార వైసీపీ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించగా.. టీడీపీ, జనసేన పొత్తులతో వెళ్లాలని డిసైడ్ అయ్యాయి. అంతేకాదు బీజేపీ కూడా తమతో కలిసి వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా కొద్దిరోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అమిత్‌ షా, జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే షా, నడ్డా రాష్ట్ర పర్యటనలు చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇప్పటికే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం శ్రీకాళహస్తిలో పర్యటించారు. బీజేపీ మహాజన సంపర్క్‌ అభియాన్‌ సభలో పాల్గొన్న నడ్డా.. మోదీ తొమ్మిదేళ్ల పాలనను ప్రజలకు వివరించడంతో పాటు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో అభివృద్ధి నిలిచిపోయి స్కామ్‌లు నడుస్తాయని మండిపడ్డారు. అభివృద్ధితో మోదీ దేశాన్ని పరుగులు పెట్టిస్తుంటే.. జగన్ అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. విశాఖ వేదికగా జరగనున్న సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. నడ్డా బాటలోనే షా కూడా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడతారా? అనేది ఆసక్తిగా మారింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్