స్వతంత్ర, వెబ్ డెస్క్: రైల్వేకు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ చూపించిన తెగువ ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. భద్రాచలం నుంచి సికింద్రాబాద్ వెళ్లే మణుగూరు ఎక్స్‌ప్రెస్ శనివారం తెల్లవారుజామున వరంగల్ స్టేషన్‌కు చేరుకుంది. రైలు ఆగుతున్న సమయంలో ఓ మహిళ కిందకు దిగేందుకు ప్రయత్నించగా.. పట్టు జారడంతో ఆమె ప్లాట్‌ఫాంపై పడిపోయారు. అయితే ఆ మహిళ భయంతో రైలు తలుపు హ్యాండిల్‌ను గట్టిగా పట్టుకోవడంతో ఆమెను రైలు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ సోనాలీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ప్రయాణికురాలిని ప్లాట్‌ఫాం వైపు గట్టిగా లాగి కాపాడారు. కానిస్టేబుల్ కాపాడకపోయి ఉంటే ఆమె రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయేది. కాగా విధుల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సోనాలీని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళా కానిస్టేబుల్ తెగువను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.