సమసమాజ నిర్మాణానికి అంబేద్కర్ చేసిన కృషిని, ఆయన ఆశయాలను బీజేపీ గౌరవిస్తుందన్నారు ఆ పార్టీ ఏపీ చీఫ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి. వికసిత్ భారత్ బడ్జెట్ 2025పై మేధావులు, విద్యావంతులు, వ్యాపారరంగ నిపుణులు, డాక్టర్లు వివిధ రంగాల నిపుణులతో కరీంనగర్‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొనే ముందు ఆమె మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ సమసమాజ స్ఫూర్తికి అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. అన్నివర్గాలను అభివృద్ధి చేసినప్పుడే నిజమైన వికసిత్ భారత్ అన్నారు. దేశంలో 25 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని సర్వేలో తేలిందన్నారామె. దేశంలో 80 కోట్ల మంది ప్రజలు జన్‌ధన్ యోజన క్రింద బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం అయ్యారన్నారు.