వైసీపీ నేతలకు దిమాక్ ఖరాబ్ అయిందంటూ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు దిమాక్ ఉంటే కక్కిన కూటికోసం ఎందుకు కక్కుర్తి పడుతున్నారని విమర్శించారు.. నిజంగా దిమాక్ ఉంటే హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.. వైసీపీలో గెలిచిన కార్పొరేటర్లను ఎందుకు డబ్బులు పెట్టి సంతలో పశువులను కొన్నట్లు కొంటున్నారని ప్రశ్నించారు. నిజంగానే దిమాక్ లేదనుకుంటే కక్కిన కూటికోసం ఎందుకు కక్కుర్తి పడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.