సినీ నటుడు అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన శ్రీతేజ్‌ను పరామర్శించారు. సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను ఆయన పరామర్శించారు. ఆయన వెంట నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. సుమార్ 20 నిమిషాల పాటు ఆస్పత్రిలో ఉన్నారు. వైద్యులతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అల్లు అర్జున్ రాక నేపథ్యంలో కిమ్స్ ఆస్పత్రి వద్ద బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి శ్రీతేజ్‌కు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది.
రేవతి కుటుంబానికి పుష్ప టీమ్ నుంచి రూ.2 కోట్లు ఆర్థిక సాయం అందజేశారు. అల్లు అర్జున్ రూ.కోటి, పుష్ప 2 నిర్మాతలు, దర్శకుడు చెరో రూ.50 లక్షల చెక్కులను దిల్ రాజు ద్వారా కుటుంబానికి అందించారు.