తెలుగు రాష్ట్రాలకు 8 మంది ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించినట్టు నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గర్గ్ తెలిపారు. తెలంగాణకు నలుగురు, ఏపీకి నలుగురు IPSలు కేటాయించినట్టు చెప్పారాయన. అందులో తెలంగాణాకు ఒక మహిళ IPS..ఏపీకి ముగ్గురు మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు.
ఈ నెల 20న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 76వ IPS దీక్షాంత్ పరెడ్ జరగనుందని అమిత్ గర్గ్ చెప్పారు. పాసింగ్ ఔట్ పరేడ్ కు ముఖ్య అతిధిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వస్తున్నారని తెలిపారు. అకాడమీలో 207 మంది ట్రైనీ IPS లు శిక్షణ పొందగా.. వారిలో ఇండియన్ ట్రైనీ IPSలు 188 మంది, 20 మంది ఫారిన్ IPS లు ఉన్నారు.