తిరుపతి జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రగిరి అభ్యర్థులకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా రాజకీయ పార్టీల నేతలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. 2వేల 231 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. చిత్తూరు జిల్లాలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఎస్వీ ఇంజనీ రింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేశారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపుకు 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 17రౌండ్లలో చిత్తూరు, నగిరి నియోజకవర్గాల ఫలితాలు, 18 రౌండ్‌లో కుప్పం ఫలితాలు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపులో 1,088 మంది సిబ్బంది పాల్గొననున్నారు.పల్నాడు జిల్లా లో ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. నరసరావుపేట JNTU కళాశాలలో కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ విధుల్లో 700మంది సిబ్బంది పాల్గొననున్నారు. కౌంటింగ్ ప్రక్రియను కలెక్టర్ బాలాజీరావు, ఎస్పీ మాలిక గార్గ్ పర్యవేక్షించనున్నారు. JNTU పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. జిల్లాలో మొదటగా చిలకలూరిపేట నుంచి, చివరగా గురజాల నుంచి ఫలితాలు వెలువడనున్నాయి. ఇతర జిల్లాల వ్యక్తులు కౌంటింగ్ ప్రదేశానికి రావద్దని ఎస్పీ మాలిక గార్గ్ ఆదేశాలు జారీ చేశారు.