హైదరాబాద్‌కి ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ వచ్చారు. తెలంగాణ ఇంఛార్జీగా నియామకం అయిన తర్వాత తొలిసారి తెలంగాణకు వచ్చారామె. దీపాదాస్ మున్షీ స్థానంలో తెలంగాణ ఇంఛార్జీగా మీనాక్షి నటరాజన్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఆమేరకు తొలిసారి తెలంగాణకు వచ్చిన ఆమెకు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఘనస్వాగతం పలికారు. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, ప్రోటోకాల్ ఛైర్మన్ వేణుగోపాల్, ఫహీం, సిద్దేశ్వర్ సహా సీనియర్ కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు.