ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. నాంపల్లి కోర్టు 40నిమిషాల పాటు దీపాదాస్ మున్షీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. తదుపరి విచారణ 2వారాలకు నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.బీజేపీ నేత NVSS ప్రభాకర్‌పపై 10కోట్లు పరువునష్టం దావా వేసింది మున్షి. ఎన్నికల సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల కోసం పలువురు నేతలు ఆమెకు బెంజ్ కార్లు గిఫ్ట్‌గా ఇచ్చారంటూ ప్రభాకర్ చేసిన ఆరోపణలు చేశారు. కొన్నేళ్లుగా కాంగ్రెస్ ఇన్చార్జులపై అవినీతి ఆరోప ణలు వస్తూనే ఉన్నాయి. ఐదేళ్లలో ఇద్దరు మాజీ ఇన్చార్జులపైనా ఇలానే ఆరోపణలు రావడంతో అధిష్ఠానం వారిని పక్కన పెట్టింది. ప్రస్తుత ఏఐసీసీ ఇన్చార్జు దీపాదాస్. పదవులు, ఎన్నికల్లో టికెట్లు ఇప్పించేందుకు బెంజ్ కార్లు తీసుకున్నారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. దీంతో ఆమె నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు.


