వైసీపీ అరాచకాలకు నటి జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనమని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ఆడుదాం ఆంధ్రా అని కోట్లు దోచుకున్నారని చెప్పారు. ఆడుదాం ఆడవాళ్లతో అని అమాయక మహిళల జీవితాలు నాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు జిత్వానీ కేసులో ఐపిఎస్ అధికారుల పాత్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. గత జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదన్నారు. చంద్రబాబు పాలనకి, జగన్ పాలనకు చాలా తేడా ఉందన్నారు. కుక్కల విద్యాసాగర్ కేసు పెడితే ఐపీఎస్‌లు పరుగులు పెట్టారన్నారు. ఛీటింగ్ కేసులో పోలీసులు త్వరగా స్పందించడం అభినందనీయమని.. ఇతర కేసుల్లో ఇలా ఎందుకు దర్యాప్తు చేయలేదని ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లోనే ఈ వ్యవహారమంతా నడిపారని బుద్ధా వెంకన్న తెలిపారు.