అచ్యుతాపురం ఘటన బాధాకరమన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. సీఎం చంద్రబాబు కేజీహెచ్‌కు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. LG పాలీమర్స్ ఘటనలో తమ ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇచ్చిందని.. ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం పరామర్శించకపోవడం మంచి సంప్రదాయం కాదన్నారు . నష్ట పరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదన్నారుచ బొత్స.