రైతు రుణమాఫీపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రేవంత్‌కు దమ్ముంటే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లోకి రావాలని..రుణమాఫీ జరిగిందో.. లేదో గ్రామాల్లోకి వెళ్లి అడుగుదామని కేటీఆర్ సవాల్ చేస్తే.. రుణమాఫీ చేస్తామని ఎందరో దేవుళ్లపై సీఎం రేవంత్ ఒట్టు పెట్టారని..ఇప్పుడు రుణాలు మాఫీ చేయకుండా దేవుళ్లని సైతం మోసం చేశారని హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే బీఆర్ఎస్ నేతల విమర్శలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు చెప్పేవన్నీ కారుకూతలేనని..పది ఏళ్లు రైతులను దగా చేసి..ఇప్పుడు మళ్లీ రైతుల పేరుతో అబద్దపు మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని రేవంత్ అన్నారు.