సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి.. వీరిద్దరి కాంబోలో రూపుదిద్దుకుంటున్న మూవీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. అఫిషియల్ గా ఎలాంటి అప్ డేట్ రావడం లేదు. అయితే.. ఈ సినిమా గురించి ఎలాంటి లీకులు ఇవ్వకూడదని.. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ నుంచి అగ్రిమెంట్ చేయించుకున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ జక్కన్నకు చిక్కకుండా లీక్ చేసారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఏం లీక్ చేశారు..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి.. ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో మూవీ అంటూ ఇప్పటి నుంచి కాదు ఓ దశాబ్ధం క్రితం నుంచే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ క్రేజీ కాంబోలో మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. అయితే.. రాజమౌళి సినిమాను ఓ యజ్ఞంలా ఎంతో శ్రద్ధతో తీస్తుంటారు. ఇంకా చెప్పాలంటే.. అమరశిల్ప జక్కన్నలా చెక్కుతుంటారు. అందుకనే రాజమౌళిని జక్కన్న అంటుంటారు. ఇప్పటి వరకు రాజమౌళి తీసిన సినిమాలను మించేలా ఈ పాన్ వరల్డ్ మూవీని చాలా గ్రాండియర్ గా ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా కోసం రాజమౌళి రూటు మార్చారు. గతంలో అయితే.. షూటింగ్ స్టార్ట్ చేసే ముందు ప్రెస్ మీట్ పెట్టి కథ ఏంటో కూడా చెప్పేసేవారు కానీ.. ఇప్పుడు రూటు మార్చి.. ప్రెస్ మీట్ పెట్టకుండానే షూటింగ్ స్టార్ట్ చేసేశారు జక్కన్న.
ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇప్పటి వరకు దీనిపై ఎవరు కూడా ఓపెన్‌గా స్పందించలేదు కానీ.. తాజాగా పృథ్వీరాజ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇంతకీ ఏమని పోస్ట్ పెట్టాడంటే.. తన డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమాను పూర్తి చేసి ప్రమోషన్లు ముగించాలి. ఎందుకంటే.. కొత్త సినిమా కోసం గెటప్ మార్చుకోవాలి. నా మాతృభాష కాని భాషలో లాంగ్ మోనోలాగ్స్ ఉండే పాత్ర కోసం ప్రిపేర్ అవ్వాలి.. అంటూ రాసుకొచ్చాడు. ముఖ్యంగా మాతృభాష కాని భాషలో అని చెప్పడంతో ఇది SSMB29 అదేనండి.. మహేష్ బాబు మూవీ గురించే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎక్కడా ఈ సినిమా గురించి మాట్లాడకూడదని రాజమౌళి కండీషన్ పెట్టాడని ప్రచారం జరుగుతోంది. అయితే.. రాజమౌళికి దొరక్కకుండా ఈవిధంగా లీక్ చేశాడని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరి.. ప్రచారంలో ఉన్నది నిజమా..? కాదా..? పృథ్వీరాజ్ ఈ మూవీలో నటిస్తున్నాడా..? లేదా.? అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.