Fire Accedent | దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ నివాస భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు భారతీయులు సహా 16 మంది మరణించారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దుబాయ్‌లోని అల్ రస్ ప్రాంతంలో శనివారం ఈ ప్రమాదం సంభవించినట్టు ‘గల్ఫ్ న్యూస్’ వెల్లడించింది. భవనంలోని నాలుగో అంతస్తులో మంటలు ఏర్పడగా.. అవి క్రమేణా వ్యాపించి బిల్డింగ్ అంతటా విస్తరించాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న దుబాయ్ సివిల్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నివాసితులను హుటాహుటినఅక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనలోమృతి చెందిన నలుగురు భారతీయుల్లో కేరళకు చెందిన దంపతులు, తమిళనాడుకు చెందిన ఇద్దరు ఉన్నట్టు స్థానిక మీడియా తెలిపింది. వీరందరూ అదే భవనంలో పనిచేస్తున్నట్టు స్థానిక సామాచారం.