తన అక్క కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తులను తప్పంటూ వారించబోయిన యువకుడిని, మరో ఆరుగురు యువకులు చితకబాదిన సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని దేవుడు చెరువు సెంటర్‌లో కొందరు యువకులు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిసుంటే దేవా అనే యువకుడు తప్పంటూ వారించాడు. దీంతో రెచ్చిపోయిన ఆరుగురు యువకులు అతనిపై కర్రలతో దాడి చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘర్షణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒంగోలులో రోజురోజుకు పెరుగుతున్న ఘర్షణలకు ఇదో నిదర్శం అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.